Loksabha Elections 2024 | రాయ్‌బరేలిని కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు : సోనియాపై మోదీ ఫైర్
Loksabha Elections 2024 : రాయ్‌బరేలిని వదిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : రాయ్‌బరేలిని వదిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. రాయ్‌బరేలిలో ప్రచారానికి వెళ్లిన సోనియా గాంధీ తన కొడుకును ప్రజలకు అప్పగిస్తున్నానని చెప్పారని, కానీ అక్కడ దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరూ లేరా అని మోదీ ప్రశ్నించారు.
రాయ్‌బరేలి స్ధానాన్ని వారు తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ అనంతరం తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని సోనియా గాంధీ ఇప్పుడు కొడుకు కోసం ఓట్ల వేటకు వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ యువరాజు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయనాద్ నుంచి రాయ్‌బరేలి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.
రెండు లోక్‌సభ స్ధానాల నుంచి రాహుల్ పోటీ చేయడాన్ని మోదీ తప్పుపట్టారు. ఇది తన తల్లి ప్రాతినిధ్యం వహించిన స్ధానమని చెప్పుకుంటూ రాహుల్ తిరుగుతున్నారని అన్నారు. పార్లమెంటరీ స్ధానాలను సైతం ఈ కుటుంబ పార్టీలు తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఈ తరహా కుటుంబ పార్టీల నుంచి జార్ఖండ్‌ను కాపాడుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Read More :
EC | కండిషన్స్ అప్లయ్.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసీ గ్రీన్‌సిగ్నల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

