SRH vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్లో డబుల్ హైడర్స్ మ్యాచ్‌లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్..7 మ్యాచ్‌లు గెలిచి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కోల్‌కతాతో జరిగే మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోతే ఎస్ఆర్హెచ్ రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ మూడో స్థానంలో కొనసాగుతున్నది.