ఖమ్మం రూరల్: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి (Kandala Upender Reddy) పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలను పలకరించిన కందాల ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అలానే ఇంటివద్ద ఉంటూ వైద్యం చేయించుకుంటున్న గాయపడిన కూలీలను కూడా ఆదివారం ఆయన పరామర్శించారు.
మండల పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం కామంచికల్ గ్రామంలో రోడ్డు ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే కందాల కందాల ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, స్థానిక గ్రామ సర్పంచ్ బొప్పీ ప్రభాకర్, పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించిన కందాల గాయపడిన వ్యవసాయ కూలీల ఇంటింటికి వెళ్లారు. ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్న కోళ్ల లక్ష్మి, ఉమారాణి, యాసారపు ధనలక్ష్మి, బొమ్మగాని నారమ్మ, మాదాసు రమణ, కొంపల్లి మంగమ్మ, మిర్యాల కమలమ్మ, గుండు వీరలక్ష్మి, ఎర్రసంగి పార్వతి, రమణ, కాశీ లక్ష్మి, రాములమ్మ ఇండ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితులను కందాల తీశారు. అనంతరం బాధితులకు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు.


అనంతరం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్న మిగిలిన బాధితులను కూడా కందాల పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక వైద్యారోగ్య సిబ్బందికి ఆయన సూచించారు. బాధితులకు తాను, బీ ఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించిన ఆయన.. ఏమాత్రం అధైర్య పడవద్దని సూచించారు.
ఇదే ప్రమాదంలో మరణించిన దొంతుసరపు భారతమ్మ ఇంటికి వెళ్లిన కందాల, నాయకులు మృతురాలి చిత్రపటం వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎండపల్లి వరప్రసాద్, సొసైటీ చైర్మన్ జరుపుల లక్ష్మణ్ నాయక్, డైరెక్టర్ మేదరమెట్ల శ్రీనివాస్, ముత్యం కృష్ణారావు, బానోతు కృష్ణ, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగాల ఉపేందర్, పార్టీ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
