ఆదివారం 24 జనవరి 2021
National - Dec 05, 2020 , 12:53:41

అసోంలో భూ ప్రకంపనలు

అసోంలో భూ ప్రకంపనలు

గువాహటి: అసోంలోని తేజ్‌పూర్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 3.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. నేషనల్‌ సెంటర్‌ సిస్మోలజీ ప్రకారం.. శనివారం ఉదయం 10.46గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. తేజ్‌పూర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు సెంటర్‌ సిస్మోలజీ తెలిపింది. ప్రకంపనలతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని తెలిపింది. ఇంతకు ముందు నవంబర్‌ 13న రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతతో, అదే నెల 3న రిక్టర్‌ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. పొరుగున బంగ్లాదేశ్‌తో పాటు మణిపూర్‌, మేఘాలయ వరకు ప్రకంపనలు వచ్చాయి. గత మంగళవారం అర్ధరాత్రి 1.30గంటలకు మేఘాలలోని నాంగ్‌స్టోయిన్‌ వద్ద భూమికి కంపించింది.


logo