Earthquake | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రాన్ని వరుస భూకంపాలు వణికించాయి. మండి (Mandi) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:26 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. వరుస ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు నమోదు కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రంలోనూ మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని కౌకుంట్లలో 3.0 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
EQ of M: 3.3, On: 07/12/2024 02:26:15 IST, Lat: 31.41 N, Long: 76.88 E, Depth: 5 Km, Location: Mandi, Himachal Pradesh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/OTvFAilbNJ— National Center for Seismology (@NCS_Earthquake) December 6, 2024
Also Read..
Narayana Murthy | కింగ్‌ఫిషర్ టవర్స్‌లో కోట్లు ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన ఇన్ఫీ నారాయణమూర్తి
Sanjay Raut | మేము కోరుకుంటున్నదీ అదే.. త్వరలోనే కలిసి మాట్లాడుతాం : దీదీ ప్రకటనపై సంజయ్ రౌత్
Ajit Pawar | అజిత్ పవార్‌కు బిగ్ రిలీఫ్.. బినామీ కేసులో సీజ్ చేసిన ఆస్తులు విడుదల