Ajit Pawar | డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అజిత్ పవార్ (Ajit Pawar)కు భారీ ఊరట లభించింది. గతంలో సీజ్ చేసిన కోట్లు విలువైన బినామీ ఆస్తులను (Benami Case) ఆదాయపన్ను శాఖ తాజాగా క్లియర్ చేసింది (Tax Department Clears Assets). అజిత్ పవార్, అతని కుటుంబ సభ్యులు బినామీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలను ఆదాయ పన్నుశాఖ (ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్)కు చెందిన బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక అప్పీలెట్ ట్రిబునల్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఊరట కల్పించింది.
కాగా, బినామీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై 2021 అక్టోబర్ 7న అజిత్ పవార్‌కు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్‌తో పాటు మొత్తం ఐదు ప్రాపర్టీలను ఐటీ శాఖకు అటాచ్ చేసింది. వాటిలో నిర్మల్ టవర్‌తోపాటు సతారాలోని షుగర్ ఫ్యాక్టరీ, ఢిల్లీలోని ఫ్లాట్, గోవాలోని రిసార్ట్ సహా పలు ఆస్తులు ఉన్నాయి.
బినామీ ప్రాపర్టీల లబ్ధిదారుల్లో అజిత్ పవార్, ఆయన కుటుంబం ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు అప్పుడు ఓ ప్రకటనలో తెలిపారు. అజిత్ ఫ్యామిలీపై యాంటీ బినామీ చట్టం కింద కేసు బుక్ చేశారు. అజిత్ తన ఆస్తులను న్యాయమైన పదప్తిలో ఆర్జించలేదని ఐటీశాఖ తెలిపింది. అయితే తనకు లింకు ఉన్న అన్ని సంస్థలు క్రమ పద్ధతిలో పన్నులు చెల్లించినట్లు అజిత్ పవార్ చెప్పారు. ప్రతి ఏడాది పన్నులు చెల్లిస్తామని, ఆర్థిక మంత్రి అయినప్పటి నుంచి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నానని, తనతో లింకున్న అన్ని కంపెనీలు పన్నులు చెల్లించినట్లు అజిత్ వెల్లడించారు.
Also Read..
Eknath Shinde | ఏక్నాథ్ షిండే హోంశాఖ కోరుకుంటున్నారు : శివసేన ఎమ్మెల్యే
Maharashtra | ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు
Sam Pitroda | నా ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్ అయ్యాయి : శామ్ పిట్రోడా