Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే (Eknath Shinde), అజిత్ పవార్ (Ajit Pawar)లు కూడా ప్రమాణం చేశారు.
Mumbai: Maharashtra CM Devendra Fadnavis, Deputy CMs Eknath Shinde and Ajit Pawar take the oath of MLA at the special session of the Maharashtra Legislative Assembly.
(Source: Maharashtra Assembly) pic.twitter.com/H3YbMuiLnF
— ANI (@ANI) December 7, 2024
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర శాసనసభ (Maharashtra Legislative Assembly) ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటు ఎమ్మెల్యేలంతా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు విధాన్ భవన్ కాంప్లెక్స్ ఆవరణలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis, Deputy CMs Eknath Shinde, Ajit Pawar pay tribute to Chhatrapati Shivaji Maharaj, at the Vidhan Bhavan complex. pic.twitter.com/Tfv9uviAto
— ANI (@ANI) December 7, 2024
Also Read..
Sam Pitroda | నా ఫోన్, ల్యాప్టాప్ హ్యాక్ అయ్యాయి : శామ్ పిట్రోడా
Businessman | ఢిల్లీ వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగులు
Eknath Shinde | ఏక్నాథ్ షిండే హోంశాఖ కోరుకుంటున్నారు : శివసేన ఎమ్మెల్యే