Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే (Eknath Shinde), అజిత్ పవార్లు ప్రమాణం చేశారు. అయితే, మంత్రివర్గ కూర్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మంత్రిత్వ శాఖల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ నెల 11 లేదా 12 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూటమి నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే హోంశాఖ కోరుకుంటున్నట్లు (home portfolio) ఆయన సన్నిహితుడు, శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవలే (Bharat Gogavale) తెలిపారు. ‘షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంతోపాటు హోం శాఖను కూడా నిర్వహించారు. అదేమాదిరి ఇప్పుడు షిండే కూడా హోంశాఖ అడిగారు. మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరో రెండు లేదా మూడు రోజుల్లో పోర్ట్‌ఫోలియోలపై చర్చలు ముగుస్తాయని ఆశిస్తున్నాం’ అని గోగవలే వ్యాఖ్యానించారు.
Also Read..
Mamata Banerjee: తన వారసులెవరన్న దానిపై మమతా బెనర్జీ ఏమన్నారంటే
Travel Advisory | సిరియాలో దాడులు.. ట్రావెల్ అడ్వైజరీ జారీచేసిన విదేశాంగ శాఖ
Hyperloop | దేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శకం.. గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో హైపర్‌లూప్!