Businessman | దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయాడు (Delhi Businessman Shot Dead). ఈ ఘటన షాహదారా (Shahdara) జిల్లాలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ జైన్ (52) అనే వ్యక్తి యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ (Yamuna Sports Complex)లో మార్నింగ్ వాక్కు వెళ్లాడు (Morning Walk). వాకింగ్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిపై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సునీల్ జైన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు దేశ రాజధానిలోని కృష్ణా నగర్ వాసిగా గుర్తించారు. అతనికి పాత్రల వ్యాపారం (utensils business) ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
क्राइम कैपिटल – शाहदरा जिले में सुबह ही गोलियों की आवाज गूंज उठी जब बर्तन व्यापारी संजय जैन मॉर्निंग वॉक करके अपनी स्कूटी से घर की तरफ लौट रहे थे तभी बदमाशों ने रोक कर उन पर ताबड़तोड़ गोलियां चला दी ।
बताया जा रहा है कि 6 से 7 राउंड फायर चले और सभी गोलियां संजय जैन को लगी है pic.twitter.com/EWI9I9lTbT— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) December 7, 2024
Also Read..
Eknath Shinde | ఏక్నాథ్ షిండే హోంశాఖ కోరుకుంటున్నారు : శివసేన ఎమ్మెల్యే
Mamata Banerjee: తన వారసులెవరన్న దానిపై మమతా బెనర్జీ ఏమన్నారంటే
Madhya Pradesh: ప్రిన్సిపాల్‌ను షూట్ చేసిన విద్యార్థి.. మధ్యప్రదేశ్‌లో ఘటన