Sam Pitroda | గత కొన్ని వారాలుగా తన ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, సర్వర్లు పదేపదే హ్యాక్ అవుతున్నాయని ( Phone And Laptop Hacked) ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తెలిపారు. అంతటితో ఆగని హ్యాకర్లు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) రూపంలో వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
‘గత కొన్ని వారాలుగా నా ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, సర్వర్లు పదేపదే హ్యాక్ అవుతున్నాయి. హ్యాకర్లు క్రిప్టోకరెన్సీ రూపంలో పది వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే నా ప్రతిష్ఠను దెబ్బతీస్తామని హెచ్చరించారు’ అని పిట్రోడా తెలిపారు. తెలియని మొబైల్ నెంబర్, మెయిల్ నుంచి తన పేరుతో ఎలాంటి మెసేజ్లు వచ్చినా వాటిని ఓపెన్ చేయొద్దని, వాటికి స్పందించొద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Also Read..
Businessman | ఢిల్లీ వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగులు
Eknath Shinde | ఏక్నాథ్ షిండే హోంశాఖ కోరుకుంటున్నారు : శివసేన ఎమ్మెల్యే
Mamata Banerjee: తన వారసులెవరన్న దానిపై మమతా బెనర్జీ ఏమన్నారంటే