Sanjay Raut | అవకాశం ఇస్తే ఇండియా కూటమి (INDIA Bloc) సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించిన విషయం తెలిసిందే. దీదీ ప్రకటనపై శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) తాజాగా స్పందించారు. తాము కోరుకుంటున్నది కూడా అదే అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు త్వరలో కోల్‌కతా వెళ్లనున్నట్లు చెప్పారు.
‘మమతా జీ అభిప్రాయం మాకు తెలుసు. ఆమె భారత కూటమిలో ప్రధాన భాగస్వామి కావాలనే మేమూ కోరుకుంటున్నాం. దీదీ అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా, శివసేన అయినా.. మేమంతా కలిసే ఉన్నాం. ఈ విషయంపై మమతా బెనర్జీతో మాట్లాడేందుకు మేము త్వరలో కోల్‌కతా వెళ్తాం’ అని సంజయ్ రౌత్ విలేకరుల సమావేశంలో అన్నారు.
#WATCH | Delhi: On West Bengal CM Mamata Banerjee’s reported statement ‘willing to lead INDIA alliance’, Shiv Sena UBT MP Sanjay Raut says “We know this opinion of Mamata ji. We also want her to be a major partner of the INDIA alliance. Whether it is Mamata Banerjee, Arvind… pic.twitter.com/LazToK5QtS
— ANI (@ANI) December 7, 2024
కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమి పనితీరు పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం బెంగాల్ వార్తా చానెల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష కూటమికి సారథిగా వ్యవహరిస్తూ (Key Partner Of INDIA Bloc) రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనని చెప్పారు. ఇండియా కూటమిని తాను ఏర్పాటు చేశానని, అవకాశం ఇస్తే కూటమి సజావుగా నడిచేలా చూసుకుంటానని మమత చెప్పారు. బెంగాల్ నుంచే కూటమిని నడిపించగలనని పేర్కొన్నారు.
Also Read..
Mamata Banerjee | అవకాశమిస్తే ఇండియా కూటమిని నడిపిస్తా: మమతా బెనర్జీ
Mamata Banerjee: తన వారసులెవరన్న దానిపై మమతా బెనర్జీ ఏమన్నారంటే
Narayana Murthy | కింగ్‌ఫిషర్ టవర్స్‌లో కోట్లు ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన ఇన్ఫీ నారాయణమూర్తి