Narayana Murthy | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) లగ్జరీ అపార్ట్మెంట్ (luxury apartment)ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. బెంగళూరు (Bengaluru)లోని ప్రఖ్యాత కింగ్‌ఫిషర్ టవర్స్ (Kingfisher Towers)లో రూ.50 కోట్లు వెచ్చించి విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
నివేదికల ప్రకారం.. నాలుగు బెడ్రూమ్ల ఈ ఫ్లాట్ 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 16వ అంతస్తులో ఉంది. మొత్తం ఐదు విలాసవంతమైన కార్లను పార్క్ చేసుకోవచ్చు. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి ఈ ఫ్లాట్‌ను మూర్తి కొనుగోలు చేశారు. కాగా, నాలుగేళ్ల క్రితం నారాయణమూర్తి భార్య సుధామూర్తి అదే కాంప్లెక్స్‌లోని 23వ అంతస్తులో రూ.29 కోట్లతో ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
కింగ్‌ఫిషర్ టవర్స్ బెంగళూరు నడిబొడ్డున యూబీ సిటీలో ఉంది. ఇది కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పూర్వీకుల ఇళ్లు ఉన్న స్థలం. దాదాపు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని విజయ్ మాల్యా- ప్రెస్టీజ్ గ్రూప్ రెండు కలిసి అభివృద్ధి చేశాయి. 34 అంతస్తుల కింగ్‌ఫిషర్ టవర్స్‌లో మూడు బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో 81 అల్ట్రా-లగ్జరీ అపార్ట్మెంట్లు ఒక్కొక్కటి 8,000 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ స్థలంలో ఉన్నాయి. 2010లో ప్రాజెక్ట్ మొదటిసారి ప్రారంభించబడినప్పుడు, ఫ్లాట్లు చదరపు అడుగులకు రూ.22,000 చొప్పున అమ్ముడయ్యాయి. ప్రస్తుతం మూర్తి చదరపు అడుగు రూ.59,500తో కొనుగోలు చేసినట్లు తెలిసింది.
Also Read..
Ajit Pawar | అజిత్ పవార్‌కు బిగ్ రిలీఫ్.. బినామీ కేసులో సీజ్ చేసిన ఆస్తులు విడుదల
Sam Pitroda | నా ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్ అయ్యాయి : శామ్ పిట్రోడా
Eknath Shinde | ఏక్నాథ్ షిండే హోంశాఖ కోరుకుంటున్నారు : శివసేన ఎమ్మెల్యే