Mamata Banerjee | కోల్కత: ప్రతిపక్ష ఇండియా కూటమి పనితీరు పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
బెంగాల్ వార్తా చానెల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష కూటమికి సారథిగా వ్యవహరిస్తూ రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనని చెప్పారు. ఇండియా కూటమిని తాను ఏర్పాటు చేశానని, అవకాశం ఇస్తే కూటమి సజావుగా నడిచేలా చూసుకుంటానని మమత చెప్పారు. బెంగాల్ నుంచే కూటమిని నడిపించగలనని పేర్కొన్నారు.