Earthquake | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను స్వల్ప భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం మండి (Mandi) జిల్లాలో భూమి కంపించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది.
మంగళవారం మధ్యాహ్నం ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు వెల్లడించింది. కులు – మండి మధ్య కొండ ప్రాంతంలో.. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే, స్వల్ప స్థాయిలోనే భూ ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం వంటివి సంభవించలేదు. మరోవైపు భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Sreenath Bhasi | హిట్ అండ్ రన్ కేసు.. ప్రముఖ నటుడు అరెస్ట్
Yusuff Ali | లులు గ్రూప్ చైర్మన్ మంచి మనసు.. అప్పులోళ్లు గెంటేసిన మహిళను ఆదుకున్న బిలియనీర్
Naga Chaitanya | మరో వెబ్ సిరీస్కు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్.. క్లారిటీ ఇచ్చిన టీం