Sreenath Bhasi | హిట్ అండ్ రన్ కేసు (Hit And Run Case)లో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు (Malayam Actor) అరెస్ట్ అయ్యాడు. అయితే, కొద్ది సేపటికే స్టేషన్ బెయిల్పై ఆయన్ని పోలీసులు రిలీజ్ చేశారు.
మలయాళ నటుడు శ్రీనాథ్ భాసి (Sreenath Bhasi).. గత నెలలో కారులో వెళ్తూ ఓ బైక్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం శ్రీనాథ్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు (Ernakulam Central Police) తెలిపారు. ఈ కేసులో శ్రీనాథ్ సోమవారం పోలీసులు ముందు హాజరుకాగా.. అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం కొద్ది సేపటికే ఆయన్ని స్టేషన్ బెయిల్పై విడుదల చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Also Read..
Yusuff Ali | లులు గ్రూప్ చైర్మన్ మంచి మనసు.. అప్పులోళ్లు గెంటేసిన మహిళను ఆదుకున్న బిలియనీర్
British Influencer | కంటెంట్ పిచ్చి.. ఎత్తైన బ్రిడ్జ్ పై నుంచి జారిపడి ఇన్ఫ్లుయెన్సర్ మృతి