British Influencer | ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు.
తాజాగా కంటెంట్ క్రియేట్ చేసి (create social media content) సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ కోసం బ్రిటన్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ (British Influencer) సాహసోపేత స్టంట్ చేశాడు. స్పెయిన్‌లోని అత్యంత ఎత్తైన వంతెనను ఎక్కేందుకు (Climb Spains Highest Bridge) ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా.. ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (26) స్పెయిన్‌లోని అత్యంత పొడవైన తలావెరా డి లా రీనాలోని కాస్టిల్లా-లా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుకోల్పోయి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. అతడి పూర్తి వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు.
కాగా, ఈ వంతెన ఎక్కడంపై నిషేధం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెనపైకి పర్యాటకుల్ని అనుమతించడం లేదని స్పష్టం చేశారు. అయితే, కొందరు ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. థ్రిల్ కోరుకునే పర్యాటకులు సోషల్ మీడియా కంటెంట్ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు. ఫలితంగా ఇలాంటి విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు.
Also Read..
North Korea | దక్షిణ కొరియాను కలిపే సరిహద్దు రోడ్లను పేల్చేసిన కిమ్ సైన్యం
Canada | బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు.. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా