North Korea | దక్షిణ కొరియాను కలిపే సరిహద్దు రోడ్లను పేల్చేసిన కిమ్ సైన్యం
North Korea | ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) అన్నంత పనీ చేశాడు. చెప్పినట్టుగానే సియోల్‌ను కలిసే సరిహద్దు రోడ్లను పేల్చేయించాడు (blown up sections of an inter-Korean road).
North Korea | ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని దేశాల అధినేతలతో పోలిస్తే కిమ్ రూటే సపరేటు. ఆయన ఏదైనా చెప్పాడంటే అది కచ్చితంగా చేసి తీరుతాడు. తాజాగా పొరుగు దేశం దక్షిణ కొరియా (South Korea) విషయంలోనూ అదే చేశాడు. చెప్పినట్టుగానే సియోల్‌ను కలిసే సరిహద్దు రోడ్లను పేల్చేయించాడు (blown up sections of an inter-Korean road).
దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఉత్తర కొరియా సైన్యం నాలుగు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తమ దేశంతో ఉన్న సరిహద్దును దాటే రోడ్ల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి ఆ రోడ్లను సోమవారం పేల్చేయించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీప్స్ ఆఫ్ స్టాఫ్ మంగళవారం వెల్లడించారు. తమ వైపు రహదారులను మాత్రం సైన్యం కాపాడుతున్నట్లు తెలిపారు.
కాగా, తమ రాజధాని ప్యాంగాంగ్పైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపిందని ఉత్తర కొరియా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో అనుసంధానం ఉన్న రైలు, రోడ్లను పూర్తిగా కట్ చేసి సరిహద్దు ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని గత వారం ఉత్తర కొరియా సైన్యం తెలిపింది. మరోసారి ప్యాంగాంగ్ పైన దక్షిణ కొరియా డ్రోన్లు కనిపిస్తే భయంకరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. సరిహద్దుల్లో కాల్పుల కోసం ఎనిమిది సైనిక యూనిట్లను సిద్ధంగా ఉంచింది.
Also Read.
Pumpkin | 1,121 కేజీల భారీ కూష్మాండాన్ని పండించి.. విజేతగా నిలిచిన అమెరికా టీచర్
Canada | బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు.. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

