Canada | భారత్ (India)పై కెనడా (Canada) మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang)తో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. ప్రో ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకొని కెనడాలో పని చేస్తున్నారంటూ ఆరోపించింది. ‘కెనడాలో ఉన్న భారత ఏజెంట్లు ప్రో ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకొని లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో కలిసి పని చేస్తున్నాయి’ అని ఆరోపించింది.
ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సోమవారం రాత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ఏజెంట్లు తమ భూభాగంపై హత్యలు, హింసాత్మక కార్యకలాపాలకు (serious criminal activity) పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.
కెనడాలోని దక్షిణాసియా కమూనిటీని ముఖ్యంగా ప్రో ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేర కార్యకలాపాల్లో బిష్ణోయ్ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు ఒట్టావా ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం.
కెనడాతో మరింతగా దెబ్బతిన్న దౌత్య సంబంధాలు..
భారత్, కెనడా మధ్య విభేదాల నేపథ్యంలో దౌత్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలోని రాయబారి, దౌత్య అధికారులను భారత్ వెనక్కి పిలిపించింది. (India recalls Canada envoy) ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో భారత రాయబారులపై కెనడా అభియోగాలు మోపింది. ఒట్టావాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్య అధికారులను ఈ కేసులో ‘ఆసక్తి ఉన్న వ్యక్తులు’గా ఆరోపించింది.
ఈ అంశంపై భారత్ సీరియస్‌గా స్పందించింది. సోమవారం సాయంత్రం కెనడా వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిపించింది. కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై నిరాధారమైన ఆరోపణలు ఆమోద యోగ్యం కాదని పేర్కొంది.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. కెనడాలోని భారత రాయబారులను వెనక్కి పిలిపించింది. ‘ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వం చర్యలు భారత ధౌత్యాధికారుల భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నట్లు తెలుస్తున్నది. వారి భద్రతకు హామీ ఇవ్వడానికి ప్రస్తుత కెనడియన్ ప్రభుత్వం నిబద్ధతపై మాకు విశ్వాసం లేదు. అందువల్ల హైకమిషనర్, లక్ష్యంగా ఉన్న దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Also Read..
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
Heavy Rain | తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
KTR | ఫాక్స్‌కాన్‌ను తెలంగాణకు తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం: కేటీఆర్