హైదరాబాద్: లక్ష మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్‌కాన్ కంపెనీని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మరికొన్ని నెలల్లో కంపెనీ ప్రారంభం కానుండటం గర్వంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టి మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ఫాక్స్‌కాన్ తెలంగాణలో రూ.1656 కోట్లకుపైగా పెట్టుబడితో కొంగరకలాన్‌లో పరిశ్రమను నెలకొల్పనుంది. దీనికి సంబంధించి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో 2023లో ఫాక్స్‌కాన్ ఒప్పందం చేసుకున్నది. గతేడాది మార్చి 15న కొంగరకలాన్‌లో కేటీఆర్ ఫాక్స్‌కాన్‌కు భూమిపూజ చేశారు. తాజాగా రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సముఖత వ్యక్తం చేసింది.
This was the biggest employment creating investment opportunity created by KCR Govt for one Lakh Telangana youngsters
Super proud that Foxconn will be up and running in a couple of months
Hope they continue to invest and grow in Telangana https://t.co/2E689T1Ad5
— KTR (@KTRBRS) October 15, 2024