Omar Abdullah | ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ ఆహ్వానం.. రేపు జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
Omar Abdullah | జమ్ము కశ్మీర్లో ఎన్సీ - కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) రేపు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
Omar Abdullah | జమ్ము కశ్మీర్లో ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) రేపు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు ఒమర్ అబ్దుల్లాను.. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ పంపిన లేఖను ట్వీట్‌కు జత చేశారు.
కాగా, ఇటీవలే జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మెజారిటీ సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను 42 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నిలిచింది. ఇక ఇక్కడ ఎన్సీకి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసన సభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరాయి. దీంతో 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఎల్జీ ఆహ్వానించారు.
మరోవైపు జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం సోమవారం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. అది వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో శాసన సభను రద్దు చేసి, ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. అది ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
ఈ సమయంలో అక్కడ జరిగిన పరిణామాల, భద్రతాపరమైన కారణాలవల్ల 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. దీంతో 2019 అక్టోబర్ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అది ఇప్పటి వరకు కొనసాగుతున్నది. కాగా, 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్లో అసెంబ్లీలో ఎన్సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read..
North Korea | దక్షిణ కొరియాను కలిపే సరిహద్దు రోడ్లను పేల్చేసిన కిమ్ సైన్యం
Pumpkin | 1,121 కేజీల భారీ కూష్మాండాన్ని పండించి.. విజేతగా నిలిచిన అమెరికా టీచర్
Canada | బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు.. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

