Himachal Pradesh | ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భారీగా మంచు కురుస్తోంది (Heavy Snow Fall). అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి.
#WATCH | Himachal Pradesh: Nawar valley of Tikkar area in Shimla district covered in a blanket of thick snow, as the area receives heavy snowfall. pic.twitter.com/L71l1yTssr
— ANI (@ANI) December 24, 2024
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీ, రాజధాని సిమ్లా సహా తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన మంచు పరిస్థితుల దృష్ట్యా అధికారులు పలు రహదారులను మూసివేశారు. మూడు జాతీయ రహదారులు సహా 174 రోడ్లను మూసివేసినట్లు (Roads Closed) అధికారులు మంగళవారం తెలిపారు.
Himachal Pradesh | Due to heavy snowfall in higher reaches of Himachal Pradesh, 174 roads including 3 National Highways are closed in the state.
Visuals from the Tikkar area of Nawar Valley of the Shimla district pic.twitter.com/v0Pl7lIsDQ
— ANI (@ANI) December 24, 2024
Also Read..
Heavy Snow | మనాలీలో భారీగా హిమపాతం.. చిక్కుకుపోయిన 1,000కి పైగా వాహనాలు.. VIDEOS
J-35A Fighter Jets: చైనా నుంచి 40 స్టీల్త్ ఫైటర్ విమానాలు కొనుగోలు చేయనున్న పాకిస్తాన్