Heavy Snow | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది (Heavy Snow). జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలీ (Manali)తోపాటు రాజధాని సిమ్లాలో (Shimla) దట్టంగా మంచు కురుస్తోంది. హిమపాతం భారీగా పడుతుండటంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
मनाली …#Manali #HimachalPradesh #News #Video pic.twitter.com/WLRVF0L71H
— swati saini (@swati8saini) December 24, 2024
విపరీతమైన మంచు కారణంగా రోహతంగ్ (Rohtang)లోని సొలాంగ్ (Solang) – అటల్ టన్నెల్ (Atal Tunnel) మధ్య సోమవారం రాత్రి దాదాపు వెయ్యికి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దట్టంగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 700 మందికిపైగా పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
#WATCH | Himachal Pradesh: Heavy snowfall causes a long traffic jam as nearly 1000 vehicles get stuck between Solang and Atal Tunnel, Rohtang. The police team is busy clearing the traffic jam amid snowfall. 700 tourists have been rescued safely. (23.12)
Source: Himachal Pradesh… pic.twitter.com/wb9ZfKh6H6
— ANI (@ANI) December 23, 2024
కాగా, ఏటా క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో మనాలీ, సిమ్లాకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా తరలివస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటారు. గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు మనాలీ, సిమ్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
As season’s heavy snowfall, more than 1000 vehicles have been stuck from solang Nallah to #Ataltunnel. DSP, SDM and SHO Manali on the ground with police team… Rescue operation is going on .. 700 vehicles have been evacuated. #Manali #HimachalPradesh @himachalpolice pic.twitter.com/kzfo7Sfebj
— Aman Bhardwaj (@AmanBhardwajCHD) December 23, 2024
मनाली के मज़ाच गाँव में बर्फ गिरना जारी है ।
🌨️❄️#snowfall #manali #himachal pic.twitter.com/mET9ofailC— Somesh Kaushik (@SomeshS69064538) December 23, 2024
Also Read..
Cancer | మీరు టీ, కాఫీ తాగుతారా.. అయితే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడ్డట్టే..
GST | పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. రేట్లపై విమర్శలు, వెక్కిరింతలు