GST | న్యూఢిల్లీ: పాప్‌కార్న్‌పై కేంద్రం నిర్ణయించిన కొత్త జీఎస్టీ రేట్లపై విమర్శలు, వెక్కిరింతలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాప్‌కార్న్‌పై కొత్త జీఎస్టీ రేట్లను నిర్ణయించారు. ఉప్పు, కారం, మసాలాలు కలిపిన నాన్ బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 5%, బ్రాండెడ్, ప్రీ-ప్యాక్డ్ పాప్‌కార్న్‌పై 12% జీఎస్టీ విధించారు. కారామెల్ పాప్‌కార్న్‌ను చక్కెర కలిసిన మిఠాయిగా పేర్కొం టూ 18% జీఎస్టీ నిర్ణయించారు.
సులభంగా ఉండాల్సిన ట్యా క్స్ రేట్ల ను సంక్లిష్టంగా మార్చడాన్ని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ తప్పుబట్టారు. ఈ సంక్లి ష్ట విధానం ప్రజలకు ప్రాణసంకటంగా మారుతుందని మాజీ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ విమర్శించారు. కొత్త జీఎస్టీ రేట్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సాల్టెడ్ పాప్‌కార్న్‌కు 5%, కారామెల్ పాప్‌కార్న్‌కు 18% జీఎస్టీ అంటే రెండు కలిపిన వాటికి ఎంత జీఎస్టీ వర్తిస్తుందని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.