Gummadi Narasaiah | పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ వేత్తగా, ప్రజా నాయకుడిగా ఎంతో ప్రజాదరణ పొందిన నాయకుడు గుమ్మడి నర్సయ్య. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచే ఆయన బయోపిక్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్‌కుమార్ (Shiva rajkumar) టైటిల్ రోల్లో నటిస్తున్నారు. పరమేశ్ హివ్రాలే డైరెక్ట్ చేస్తున్నాడు.
తాజాగా మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. తాజా పోస్టర్లో శివన్న ఎర్ర జెండాల మధ్య పిడికిలి బిగించి కనిపిస్తున్నాడు. దృఢ సంకల్పం, మండుతున్న కళ్లు, దశాబ్దాల ప్రజల పోరాటాలను ప్రతిధ్వనించే ఎర్ర జెండాల సముద్రం అంటూ షేర్ చేసిన నయా లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో శివన్నతెలుగు రంగు చొక్కా, ధోతిలో భుజాన ఎర్ర కండువా వేసుకుని సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తుండటం చూడొచ్చు. సైకిల్ హ్యాండిల్‌కు సీపీఐఎంఎల్ జెండాను గమనించవచ్చు. అసెంబ్లీ ముందు నుంచి మిగిలిప ప్రజాప్రతినిధులంతా బుగ్గ కార్లలో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సాదాసీదాగా సామాన్య వ్యక్తిలా సైకిల్‌తో వెళ్తుంటాడు.
గుమ్మడి నర్సయ్య పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేసి మొదటి ప్రయత్నంలోనే అందరి ఫోకస్ తనవైపునకు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని ప్రవళ్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేశ్ రెడ్డి నిర్మిస్తుండగా.. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. చిరు గొడవలు, లావణ్య విత్ లవ్ బాయ్స్ సినిమాల్లో నటించిన పరమేశ్ హివ్రాలే ఈ మూవీతో డైరెక్టర్‌గా మారుతుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
Clenched resolve, burning eyes, and a sea of red flags echoing decades of people’s struggles#GummadiNarasaiah Ugadi special poster sets the stage for a hard-hitting, politically charged biographical drama
A @parameshhivrale directorial
Produced by @Pravallika_Arts — Production… pic.twitter.com/3asCrZkqpU— Sai Satish (@PROSaiSatish) March 19, 2026
PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!