Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు (devotees) పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో వాహనాల రద్దీ దృష్ట్యా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. రెండు రోజులు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లొద్దని సూచించింది.
ప్రయాగ్‌రాజ్‌లో రద్దీ ఎక్కువగా ఉందని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో రివాంచల్ (Rewanchal)తోపాటు ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఉన్న జిల్లాలపై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగినట్లు చెప్పారు. రద్దీ దృష్ట్యా రాబోయే రెండు రోజులు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లొద్దని యాత్రికులకు సూచించారు. అంతేకాదు ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్‌లో చెక్ చేసుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి నీరు, ఆహారంతోపాటు ఇతర అత్యవసర సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్ని ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా యూపీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Also Read..
Droupadi Murmu | త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం.. గంగమ్మకు ప్రత్యేక పూజలు
Kumbh Mela: కుంభమేళా ఎఫెక్ట్.. హైకోర్టు కేసులన్నీ వాయిదా