Anna University | తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ (Anna University) లో విద్యార్థినిపై అత్యాచారం ఘటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై (womens safety) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల భద్రతపై సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth)కు ప్రశ్న ఎదురైంది. తన తదుపరి చిత్రం కూలీ (Coolie) షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌కు బయల్దేరిన తలైవాకి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. తన తదుపరి చిత్ర ప్రాజెక్ట్స్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన రజినీకాంత్.. మహిళల భద్రత గురించి విలేకరుల ప్రశ్నను దాటవేశారు. ‘నన్ను రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగొద్దు’ (Dont ask political questions) అంటూ సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
#Coolie 70% Shoot Done
Next Schedule Thailand
Jan 13-25th✨ #Rajinikanthpic.twitter.com/wnU3GZmt9h— im.pratheesh (@KettavaN6474) January 7, 2025
కాగా, అన్నా యూనివర్సిటీలో సెకండియర్ చదువుతున్న విద్యార్థినిపై గతేడాది డిసెంబర్ 23న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ వెనుకవైపు ఏకాంతంగా ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లి వారిని వీడియో తీశాడు. బాధితురాలి స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకుచెబితే వీడియో బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు.
అయినా బాధితురాలు భయపడకుండా తన స్నేహితుడితో కలిసి ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్నది. నిందితుడికి నేర చరిత్ర ఉన్నదని, గతంలో కూడా అతను ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని, అయితే పరువుపోతుందన్న భయంతో ఎవరూ విషయాన్ని బయటికి చెప్పుకోలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
Also Read..
Vishal | ఆస్పత్రిలో నటుడు విశాల్.. తాజా హెల్త్ అప్డేట్
Salman Khan | భద్రతపై ఫోకస్ పెట్టిన సల్మాన్ ఖాన్.. ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. VIDEO
Warden dance | వద్దని చెప్పేందుకు వచ్చి యువతులతో కలిసి వార్డెన్ డ్యాన్స్.. వీడియో వైరల్