Vishal | పందెం కోడి, భరణి, పొగరు, డిటెక్టివ్తోపాటు పలు సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశాల్ (Vishal). అయితే మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరూ ఊహించని విధంగా విశాల్ మొహం వాచి ఉండడం.. చేతులు వణుకుతూ కనిపించడం చూసిన అభిమానులు అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో విశాల్ తాజాగా ఆస్పత్రిలో చేరాడన్న వార్త బయటకు వచ్చింది. ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. విశాల్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండగా.. అపోలో హాస్పిటల్లో చికిత్స కొనసాగుతున్నట్టు సమాచారం. విశాల్‌కు డాక్టర్లు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
హై ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ప్రమోషన్స్‌కు హాజరై.. సినిమా పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పిన విశాల్ కమిట్మెంట్కు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
12 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత..
యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వచ్చిన మదగజరాజ చిత్రాన్ని సుందర్ సీ డైరెక్ట్ చేశాడు. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంతానం, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. 2013 పొంగళ్ కానుకగా జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడ్డది. 12 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రమోషనల్ ఇంటర్వ్యూలో..
விஷால் என்னோட தம்பி என் குடும்பத்துல ஒருத்தர் #Shorts #Vishal #MadhaGajaRajaEvent pic.twitter.com/nvJOMgddnM
— Aadhan Cinema (@AadhanCinema) January 7, 2025