Half Day Schools | 15 నుంచి ఒంటిపూట బడి..ఉపాధ్యాయ, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు
ఒంటిపూట బడి ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో 16 సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఒంటిపూట బడి ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో 16 సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నిర్వహించనున్నారు. 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై.. 34 రోజులపాటు జరుగనున్నాయి. మొదట ప్రభుత్వం పదో తరగతి పరీక్ష కేంద్రాలు కలిగిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.
దీనిపై ఉపాధ్యాయ, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పరీక్షలు ఉన్న రోజుల్లోనే మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూళ్లు నడుపాలని నిర్దేశించింది. దీంతో పరీక్షలు లేని రోజుల్లో యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. కాగా, ఒంటిపూట బడిని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్ల యాజమానులు కఠిన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించింది. పాఠశాల విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

