Warden dance : నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచదేశాల్లో ఎంతో మంది సంబురాల్లో మునిగితేలారు. రకరకాలుగా పార్టీలు చేసుకున్నారు. భారత్తో సైతం జోరుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. యూనివర్సీటీలు, కాలేజీలు, హాస్టల్స్లో యువత ఎంజాయ్ చేశారు. అయితే కొన్ని కాలేజీలు, హాస్టళ్లలో కఠినంగా వ్యవహరించే టీచర్లు, వార్డెన్ల కారణంగా విద్యార్థులు వేడుకలను సరిగ్గా జరుపుకోలేకపోయారు.
ఓ హాస్టల్లో యువతులు ఆటపాటలతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా వార్డెన్ కోపంగా అరుస్తూ అక్కడికి వచ్చింది. యువతుల అల్లరిని ఆపాలనేది ఆమె ఉద్దేశం. కానీ తీర అక్కడికి వచ్చిన తర్వాత ఆమె నిర్ణయం మారిపోయింది. యువతులు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని చూసి ఆమె కాదనలేకపోయింది. పైగా వారితో కలిసి స్టెప్పులు వేసి వారిలో జోష్ నింపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మా వార్డెన్ కూడా ఇలా ఉంటే బాగుండునని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా చేసినప్పుడల్లా మా వార్డెన్ మమ్మల్ని అవమానిస్తుందని మరో యూజర్ రాసుకొచ్చారు.