Salman Khan | గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తన భద్రతపై ఫుల్ ఫోకస్ పెట్టారు (Big Security Upgrade). ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన ఈ సల్లూ భాయ్ తాజాగా తన ఇంటి భద్రతను పటిష్టపర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముంబై బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ (Galaxy Apartments) వద్ద సెక్యూరిటీని పెంచుకుంటున్నారు.
తాజాగా సల్మాన్ ఇంటి బాల్కనీకి ఓ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ (Bulletproof glass)ని ఏర్పాటు చేశారు. అంతేకాదు అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే గుర్తించేందుకు హై రిజల్యూషన్ కలిగిన సీసీటీవీ కెమెరాలతోపాటు (high-resolution CCTV camera ) హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు కార్మికులు సల్మాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమరుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Mumbai, Maharashtra | Bulletproof glass installed in the balcony of actor Salman Khan’s residence – Galaxy Apartment pic.twitter.com/x6BAvPOGyW
— ANI (@ANI) January 7, 2025
1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్ గాంగ్ టార్గెట్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. గతేడాది ఏప్రిల్‌లో గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటారు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్‌లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్‌పై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ పూర్తి భద్రతా వలయంలో ఉన్నారు.
సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం సికిందర్ (Sikandar)లో నటిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఇన్సైడ్ టాక్.
Also Read..
“Salman Khan | షూటింగ్ సెట్‌కు వెళ్లి మరీ.. సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు”
“Salman Khan | బాబా సిద్ధిఖీ కంటే ముందు సల్మాన్ హత్యకు షూటర్ల ప్లాన్..!”
“Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు.. 24 ఏళ్ల పాటల రచయిత అరెస్టు”