Salman Khan | ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique) అక్టోబరు 12న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. ఆ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి.
బాబా సిద్దిఖీపై ఫైరింగ్ చేసిన ముగ్గురు షూటర్లు.. ముందుగా సల్మాన్ ఖాన్ (Salman Khan)ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది (Shooters planned to kill Salman Khan). అయితే, అది సాధ్యం కాకపోవడంతోనే సిద్ధిఖీని హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తమ హిట్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ టాప్‌లో ఉన్నట్లు షూటర్లు విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముందుగా నటుడిని హత్య చేయాలని షూటర్లు ప్లాన్ చేసుకున్నప్పటికీ.. టైట్ సెక్యూరిటీ కారణంగా సల్మాన్ వద్దకు వెళ్లలేకపోయారు. దీంతో సిద్ధిఖీని టార్గెట్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
Also Read..
Sanjay Raut | షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు : సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
Air Pollution | ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత.. 165గా ఏక్యూఐ లెవల్స్
Delhi Triple Murder | వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ.. కుమారుడే హంతకుడు