Salman Khan | బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు హత్య బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. బుధవారం రాత్రి షూటింగ్ సెట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి సల్మాన్ బాడీగార్డ్‌తో (threatens his bodyguard) లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణితో మాట్లాడినట్లు గురువారం పోలీసులు తెలిపారు.
సల్మాన్ ఖాన్ బుధవారం రాత్రి శివాజీ పార్క్ ప్రాంతంలో షూటింగ్ సెట్లో ఉండగా.. ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ పేరును ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అప్రమత్తమైన షూటింగ్లో ఉన్న సిబ్బంది సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం శివాజీ పార్క్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా, కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
Salman Khan | బాబా సిద్ధిఖీ కంటే ముందు సల్మాన్ హత్యకు షూటర్ల ప్లాన్..!
PSLV-C59 | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్
Naga Chaitanya – Shobitha | శోభిత మెడలో తాళి కట్టిన చైతూ.. వీడియో