Naga Chaitanya – Shobitha | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల ( Shobitha Dhulipala) వివాహం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శోభిత మెడలో చైతూ తాళి కట్టారు. ఆ సమయంలో వేదికపై నాగార్జున, అమల, అఖిల్ అక్కినేని, వెంకటేశ్, దగ్గుబాటి సురేశ్ బాబు సహా ఇతర కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా కనిపించారు. ఇక చైతూ.. శోభిత మెడలో తాళి కడుతున్న సమయంలో అఖిల్ తెగ హంగామా చేశారు. ఈలలు వేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Once again Happy marriage life @chay_akkineni @sobhitaD 💐💐💐
Happy for you #SoChay #Chayo #SoChayWedding pic.twitter.com/tLPP4xARqG— Яavindra (@Nag_chay_akhil) December 5, 2024
ఈ వివాహ వేడుకకు చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తి, రామ్‌చరణ్, రానా, నాని, కీరవాణితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ‘చైతన్య, శోభిత తమ జీవితంలో అందమైన అధ్యాయాన్ని మొదలుపెట్టారు. నాకిది భావోద్వేగభరితమైన క్షణం. శోభితను మా అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. నాన్న ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహం ముందు ఈ పెళ్లి వేడుక జరగడం గొప్ప సంతోషాన్నిస్తోంది’ అని నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Congratulations to the beautiful couple.
Best wishes for love, joy and a memorable journey ahead. #SoChay ❤️ @chay_akkineni #SobhitaDhulipala pic.twitter.com/WUSaZkJCoS
— Annapurna Studios (@AnnapurnaStdios) December 4, 2024
Also Read..
Pushpa 2 The Rule | ‘పుష్ప 2’తో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టావు : రామ్ గోపాల్ వర్మ
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్