Ram Gopal Varma | నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule). బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఇక తెలుగు ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ మూవీపై దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా స్టార్ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. పుష్ప 2 విడుదలకు ముందుకూడా మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని వర్మ కితాబునిచ్చాడు.
CONGRATS to @alluarjun and team for giving a ALL INDIA INDUSTRY HIT ..
ALLU is MEGA MEGA MEGA MEGA MEGA— Ram Gopal Varma (@RGVzoomin) December 5, 2024