మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్
బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ (1991) చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో నాటి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. పాటలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ (1991) చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో నాటి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. పాటలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తాను హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ఈ సినిమా సీక్వెల్ ప్రకటన చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది. ఆదిత్య 999 మాక్స్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బాలకృష్ణ నిమగ్నమై ఉన్నారని, ఆయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ప్రసారం కాబోవు అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో బాలకృష్ణ ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనున్నారు. ఈ షోలో ఆయన సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తారని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

