విజయ్ దేవరకొండ ‘జటాయు’?
తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజే వేరు. జయాపజయాలతో సంబంధం లేకుండా యువతలో తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజే వేరు. జయాపజయాలతో సంబంధం లేకుండా యువతలో తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పీరియాడిక్ కథతో రూపొందుతోంది. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నారని సమాచారం. గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి ‘జటాయు’ పేరుతో ఓ వైవిధ్యమైన కథను విజయ్ దేవరకొండకు వినిపించారని, ఇప్పుడు ఆ కథకు ఆయన ఓకే చెప్పారని ఫిల్మ్సర్కిల్స్లో వినిపిస్తున్నది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర వినూత్నరీతిలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

