Doctors strike | కోల్‌కతా (Kolkata)లోని ఆర్జీ కార్ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape – murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన (Doctors strike ) చేపడుతున్నారు. విధులను బహిష్కరించి బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) పిలుపు మేరకు ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు.
#WATCH | Kolkata, West Bengal: Indian Medical Association (IMA) announces a nationwide strike over RG Kar Medical College rape and murder.
(Latest visuals from RG Kar Medical College & Hospital) pic.twitter.com/dEEWRMq2Oh
— ANI (@ANI) August 17, 2024
కోల్‌కతా సహా ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు 24 గంటల పాటు సమ్మెకు దిగారు. వైద్యుల నిరసనతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ 24 గంటల పాటూ వైద్య సేవలు అందుబాటులో ఉండవు. ఔట్ పేషెంట్ సేవలు, ఎంచుకున్న శస్త్రచికిత్స సేవలూ ఉండవు. అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగనున్నాయి.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు ఉంచింది. ఎయిర్‌పోర్టుల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలను కూడా ‘సేఫ్ జోన్లు’గా ప్రకటించాలని ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్వీ ఆశోకన్ డిమాండ్ చేశారు. వైద్యులు, సిబ్బందిపై దాడుల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలన్నారు. బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యుల పని గంటలు, పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమాండ్ చేసింది. హత్యాచారానికి గురైన బాధితురాలు వరుసగా 36 గంటల పాటు డ్యూటీలో ఉన్నారని, ఇది సరైనదేనా? అని ప్రశ్నించారు.
#WATCH | Ahmedabad, Gujarat: Residents Doctors hold a protest at the Indian Medical Association (IMA) against the rape-murder incident at Kolkata’s RG Kar Medical College and Hospital pic.twitter.com/gTiTP8axbL
— ANI (@ANI) August 17, 2024
#WATCH | Patna, Bihar: Indian Medical Association (IMA) announces nationwide strike over RG Kar Medical College rape & murder incident.
(Visuals from Patna AIIMS) pic.twitter.com/kmCr5pq0ZN
— ANI (@ANI) August 17, 2024
#WATCH | Tamil Nadu: Resident Doctors Associations of Rajiv Gandhi Government General Hospital and Madras Medical College organise a boycott protest in Chennai against the incident of rape and murder of a woman doctor at RG Kar Medical College and Hospital, Kolkata. pic.twitter.com/mtJty3AM1D
— ANI (@ANI) August 17, 2024
Also Read..
Parliament | బయటపడ్డ భద్రతా లోపం.. గోడ ఎక్కి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన యువకుడు
Sabarmati Express | పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులు సేఫ్
Kalki 2898 AD OTT | ‘కల్కి’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఏ వర్షెన్ ఎందులో చూడాలంటే..?