Kalki 2898 AD OTT | ప్రభాస్ (prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపిక పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్ నటించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 39 సంవత్సరాల తరువాత ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కలిసి నటించడంతో ఈ చిత్రం విలువ ఇంకా పెరిగింది. సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎప్పుడొస్తుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు ప్రభాస్ టీమ్ శుభవార్త చెప్పింది. ఈ చిత్రాన్ని రెండు ఓటీటీ సంస్థల వేదికగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. హిందీ వర్షెన్ ఆగస్టు 22న నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఇక అదే రోజు తెలుగు, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ (Prime Video) వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రెండు సంస్థలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాయి.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది.
Also Read..
Swetha Shine | నటిగా నిలిచాను.. నిర్మాతగా గెలుస్తాను!
Cinema News | తాతామనవళ్లుగా నటిస్తున్న తండ్రీకొడుకులు.. వారెవరంటే?
National Film Awards | సామాజిక కథాంశాలకు పెద్దపీట.. పొన్నియన్ సెల్వన్‌కు నాలుగు అవార్డులు