Plane Crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Plane Crash) మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 99 మృతదేహాలను అధికారులు (DNA Matching) గుర్తించారు. 64 డెడ్ బాడీస్‌ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారంతా ఖేడా, అహ్మదాబాద్, కోట, మహేసానా, భరూచ్, వడోదర, అరవల్లి, ఆనంద్, జునాగఢ్, భావ్‌నగర్, అమ్రేలి, మహిసాగర్, భావ్‌నగర్‌కు చెందిన వారిగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ తెలిపారు.
గతవారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read..
Rapido Driver | షాకింగ్ ఘటన.. యువతిపై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవర్.. Video