DK Shivakumar | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధికార మార్పిడి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ లేకపోతే.. జీవితమే లేదని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందంటూ పేర్కొన్నారు.
ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2025 సదస్సులో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెండో సగభాగం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా..?’ అన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి డీకే స్పందిస్తూ.. ‘నేను దీనికి సమాధానం చెప్పలేను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆశతో జీవించాలి. ఆశ లేకపోతే.. జీవితమే లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. సీఎం మార్పు నిర్ణయం పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్‌దేనని తెలిపారు. హైకమాండ్ నిర్ణయం, ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. హైకమాండ్ ఏం నిర్ణయిస్తే.. దాన్ని అంగీకరిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Raj Kundra | రూ.60 కోట్ల మోసం కేసు.. రాజ్ కుంద్రాకు సమన్లు జారీ
Nepal | రణరంగంగా నేపాల్.. భారతీయులకు కీలక అడ్వైజరీ