Devendra Fadnavis | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఫలితాల్లో మహాయుతి (Mahayuti) కూటమి గెలుపు దాదాపు ఖరారైంది. మొత్తం 288 స్థానాలకు గానూ 220 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఈ తరుణంలో మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక్కరు ఉంటేనే భద్రంగా ఉంటుంది.. అది మోదీ వల్లే సాధ్యం’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్ట్‌కు మహారాష్ట్ర హ్యాష్‌ట్యాగ్ జోడించారు. ప్రస్తుతం ఫడ్నవీస్ పోస్ట్ వైరల్‌గా మారింది.
एक है तो ‘सेफ’ है !
मोदी है तो मुमकिन हैं ! #Maharashtra #महाराष्ट्र— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 23, 2024
కాగా, కూటమిలోని పెద్ద పార్టీ అయిన బీజేపీనే ఈ సారి సీఎం పదవి చేపడుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్ట చూస్తే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) మహా తదుపరి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఏక్నాథ్ షిండే (Eknath Shinde)నే మహారాష్ట్ర తదుపరి సీఎం అని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంగా మారింది. మహా అసెంబ్లీ గడువు ఈనెల 26తో ముగియనున్న విషయం తెలిసిందే. గెలిచిన వాళ్లు 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహా తదుపరి సీఎం ఎవరన్నదానిపై మరో రెండు లేదా మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read..
Maharashtra CM | షిండేనా.. ఫడ్నవీసా.. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..?
Maharashtra CM | ఈనెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణస్వీకారం..!
Sanjay Raut | ఇది ప్రజా తీర్పుకాదు.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు