Cold wave | చలి తీవ్రతకు (Cold wave) ఉత్తర భారతం (North India) వణుకుతోంది. ఢిల్లీ సహా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో దట్టమైన పొగ మంచు కమ్మేసింది (Dense fog). పొగమంచు కారణంగా విమాన, రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది (flights impacted in Delhi).
#WATCH | Visibility reduced to zero in parts of the national capital as a blanket of dense fog covers Delhi.
Visuals from near the IGI airport pic.twitter.com/rpQmBlMHRJ
— ANI (@ANI) January 4, 2025
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజిబిలిజీ జీరోకు పడిపోయింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే దాదాపు 250 విమానాలు ఆలస్యమయ్యాయి. 40 విమానాలను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి.
#WATCH | Delhi: Several flights delayed and flight operations affected as a layer of fog grips the national capital.
Visuals from Indira Gandhi International Airport pic.twitter.com/00TFIQMJKF
— ANI (@ANI) January 4, 2025
ఇక కోల్‌కతా విమా0నాశ్రయంలో 40 విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరో ఐదు విమానాలను రద్దు చేసినట్లు ఫ్లైట్ మానిటరింగ్ ప్లాట్‌ఫాం ఫ్లైట్రాడార్ తెలిపింది. చండీగఢ్, అమృత్సర్, ఆగ్రా సహా ఉత్తరాదిలోని ఇతర విమానాశ్రయాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఆయా విమానాశ్రయాల్లో విజిబిలిటీ జీరోగా నమోదైంది.
As per IMD, visibility near airports – Palam, Safdarjung, Amritsar, Agra, Hindon, Chandigarh and Gwalior reduced to zero pic.twitter.com/Cdtj1ltRHk
— ANI (@ANI) January 4, 2025
మరోవైపు రైలు సర్వీసులకు ( trains) కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 50కిపైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22436) దాదాపు నాలుగు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తోంది. వారణాసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 14 గంటలు, మరో న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎనిమిది గంటల 17 నిమిషాలు, ఆనంద్ విహార్ టెర్మినల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏడు గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది.
#WATCH | Delhi: Several trains delayed at New Delhi railway station due to fog as cold waves grip the city.
(Visuals from New Delhi Railway station) pic.twitter.com/KK8stezodC
— ANI (@ANI) January 4, 2025
దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, లక్నో, ఆగ్రా, కర్నాల్, ఘజియాబాద్, అమృత్సర్, జైపూర్ సహా ఇతర ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లో దృశ్యమానత దారుణంగా పడిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
#WATCH | Amritsar, Punjab | BSF personnel at the Attari–Wagah border continue patrolling amid dense fog and chilling cold pic.twitter.com/WNwob3eIQs
— ANI (@ANI) January 4, 2025
Also Read..
Shamshabad | శంషాబాద్‌లో విశాఖ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Cold Wave | తెలంగాణను వణికిస్తున్న చలి.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
Sana Ganguly | మాజీ క్రికెటర్ గంగూలీ కుమార్తెకు త్రుటిలో తప్పిన ప్రమాదం..