Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతున్నారు. వరుసగా మూడోరోజు ఢిల్లీలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ 9.8 డిగ్రీల సెల్సియస్‌తో ఈ సీజన్లో రెండో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఢిల్లీలో గాలినాణ్యత చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) ప్రకారం.. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 349గా నమోదైంది. అలిపూర్లో 351, బురారీ క్రాసింగ్ వద్ద 351, డీటీయూ వద్ద 377, ఐటీవో ప్రాంతంలో 328గా ఏక్యూఐ లెవల్స్ నమోదయ్యాయి. వాయు కాలుష్యంతోపాటు ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. కన్నౌట్ ప్రాంతం, ఇండియా గేట్, ఆనంద్ విహార్ ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read..
Banana | రూ.52 కోట్లకు అమ్ముడుపోయిన ఆ అరటిపండును ఎలా తిన్నారో చూడండి.. VIDEO
Chicago | చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
Eknath Shinde | అందుకే షిండే తన స్వగ్రామానికి వెళ్లారు : శివసేన