Chicago | అమెరికాలో తుపాకీ తూటాకు (shooting) మరో తెలుగు విద్యార్థి (Telugu student) బలయ్యాడు. చికాగో (Chicago)లో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల సాయి తేజ (Sai Teja) అనే విద్యార్థి మరణించాడు. అతడు ఖమ్మం (Khammam) రూరల్ జిల్లా రామన్నపేట్కు చెందిన వాడిగా గుర్తించారు. సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే యూఎస్ వెళ్లినట్లు తెలిసింది. అయితే, కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
సాయి తేజ మరణంతో రామన్నపేట్ (Ramannapet)లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్తతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read..
Cyclone Fengal | తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు.. రహదారులు మూసివేత.. విమాన రాకపోకలపై ప్రభావం
Eknath Shinde | అందుకే షిండే తన స్వగ్రామానికి వెళ్లారు : శివసేన
Massive Fire | వారణాసి రైల్వే స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. 200 బైక్లు దగ్ధం