Cyclone Fengal | నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది శనివారం సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలో కరైకల్ – మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉందని హెచ్చరించింది.
#WATCH | Tamil Nadu: Rough sea and gusty wind witnessed due to the impact of cyclone Fengal; visuals from Mahabalipuram
As per IMD, #CycloneFengal to cross north Tamil Nadu-Puducherry coasts between Karaikal and Mahabalipuram close to Puducherry as a cyclonic storm with a wind… pic.twitter.com/1rhHvAa6Wr
— ANI (@ANI) November 30, 2024
ఈ ఫెంగల్ తుఫాను (Cyclone Fengal) ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు సమీపంలోని చెంగల్పేట్, కాంచీపురం, తిరువళ్లూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువావూర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.
#WATCH | Tamil Nadu: Continuous rains cause waterlogging in several parts of Chennai city.
(Visuals from Old Mahabalipuram Road)#CycloneFengal pic.twitter.com/tK5kz1s3Gt
— ANI (@ANI) November 30, 2024
జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షం, బలమైన గాలులకు విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది (flight ops hit). ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. చెన్నైకి రాకపోకలు సాగించే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వాతావరణం అనుకూలించిన తర్వాత విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది.
#WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Kanchipuram city.
According to the Indian Meteorological Department (IMD), Cyclone Fengal is expected to make landfall close to Puducherry, along the Tamil Nadu coast by today evening. pic.twitter.com/g3M7bA6eOC
— ANI (@ANI) November 30, 2024
తుఫాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలను నేడు మూసివేయాలని ఆదేశించింది. స్పెషల్ క్లాసెస్ వంటివి తీసుకోవద్దని, పరీక్షలు కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. భారీ వర్షం హెచ్చరికలతో ఇతర జిల్లాల్లోని కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
#WATCH | Chennai, Tamil Nadu: Rough sea witnessed due to the impact of cyclone Fengal; visuals from Kasimedu.
According to the Indian Meteorological Department (IMD), Cyclone Fengal is expected to make landfall close to Puducherry, along the Tamil Nadu coast by today evening. pic.twitter.com/b59co7vGIi
— ANI (@ANI) November 30, 2024
ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజా రవాణా సేవలను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. ఈస్ట్ కోస్ట్ రోడ్, పాత మహాబలిపురం రోడ్ సహా కీలక రహదారులపై ప్రజా రవాణా సేవలను నిషేధించింది. తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ మార్గాలపై తుఫాను వల్ల కలిగే నష్టాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు చెన్నైలో భారీ వర్షం నేపథ్యంలో అండర్‌పాస్‌లను అధికారులు మూసివేశారు. ఇదిలా ఉండగా.. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని కంపెనీలను ప్రభుత్వం కోరారు.
Also Read..
Eknath Shinde | అందుకే షిండే తన స్వగ్రామానికి వెళ్లారు : శివసేన
Massive Fire | వారణాసి రైల్వే స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. 200 బైక్‌లు దగ్ధం
TTD | తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు