Massive Fire | ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh)లోని వారణాసి (Varanasi)లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. కాంట్ రైల్వే స్టేషన్ (Cantt railway station)లోని పార్కింగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 వాహనాలు దగ్ధమయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న 12 ఫైర్ ఇంజన్లు జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సాయంతో దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 200 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు తెలిపారు.
Also Read..
Karnataka | దివ్యాంగులకూ దగా.. 80 శాతం నిధులు తగ్గించిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు
Mallikarjun Kharge | క్రమశిక్షణ లేకే ఎన్నికల్లో ఓడాం.. ఖర్గే తీవ్ర అసంతృప్తి
Maharashtra | డిప్యూటీపై షిండే విముఖత?.. మహా సీఎంపై ఇంకా వీడని సస్పెన్స్