Banana | రూ.52 కోట్లకు అమ్ముడుపోయిన ఆ అరటిపండును ఎలా తిన్నారో చూడండి.. VIDEO
Banana | ‘బనానా టేప్’ (taped banana) ఈ పదం ప్రస్తుతం తెగ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణంగా టేప్ వేసిన అరటిపండు కళ్లు చెదిరే ధర పలకడమే.
Banana | ‘బనానా టేప్’ (taped banana) ఈ పదం ప్రస్తుతం తెగ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణంగా టేప్ వేసిన అరటిపండు కళ్లు చెదిరే ధర పలకడమే. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఒక అరటిపండుకు నమ్మలేనంత ధర పలికిన విషయం తెలిసిందే.
గోడకు టేపుతో అతికించి ఉన్న ఆ అరటిపండును ఓ వ్యక్తి 6.24 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 52.7 కోట్లు)కు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చైనా పారిశ్రామికవేత్త జస్టిన్ సన్ వేలంలో దీనిని సొంతం చేసుకున్నాడు. అయితే, కొన్న తర్వాత ఆ అరటిపండును సెకన్ల వ్యవధిలోనే అతను తినేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
许多朋友问我这根香蕉的味道如何。老实说,对于一根有如此故事的香蕉,味道自然和普通香蕉不一样。我品尝出了一种100年前大麦克香蕉的味道。🍌 pic.twitter.com/ddo8pEjatx
— H.E. Justin Sun 🍌 (@justinsuntron) November 29, 2024
ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ 2019లో దీనిని సృష్టించాడు. గోడపై ఒక అరటిపండుకు టేప్ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదు. ఈ అరటిపండుకు ‘కమెడియన్’ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ కదళీఫలం వార్తల్లో నిలుస్తోంది. ‘కమెడియన్’ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్‌వర్క్‌ను మియామి బీచ్ ఆర్ట్ బాసెల్‌లో తొలిసారి ప్రదర్శించారు. ఇది ఐదేళ్ల క్రితం రూ.98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలన్ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్ డాలర్లకు అమ్ముడోపోయి ఆశ్చర్యపరిచింది.
Also Read..
Chicago | చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
US Universities: విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీల వార్నింగ్..
Justin Trudeau | ట్రంప్‌తో భేటీకానున్న జెస్టిన్ ట్రుడో.. సుంకాల పెంపుపై చర్చ!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

