Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మంగళవారం కూడా గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన కేటగిరిలో నమోదైంది. ఇవాళ రాజధాని ప్రాంతంలో ఓవరాల్ ఏక్యూఐ 309గా ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
అలీపూర్, జహంగీర్‌పురి, వజీర్పూర్.. ఈ మూడు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. అక్కడ వరుసగా ఏక్యూఐ లెవెల్స్ 241, 404, 404గా నమోదైంది. నగరంలోని 39 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత పూర్, వెరీ పూర్ (very poor category) మధ్య ఉంది. ఎన్సీఆర్ ప్రాంతంలోని ఘజియాబాద్‌లో గాలి నాణ్యత అత్యధికంగా 375 పాయింట్లుగా నమోదైంది. నోయిడాలో 329, గ్రేటర్ నోయిడాలో 329, గురుగ్రామ్‌లో 218గా ఏక్యూఐ నమోదైంది. వాయు కాలుష్యం కారణంగా రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
Also Read..
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Rule of Law | మోదీ హయాంలో ఏదీ చట్టబద్ధ పాలన?.. ‘రూల్ ఆఫ్ లా’ ఇండెక్స్‌లో మరింత దిగజారిన భారత్
ఆస్తులు పిసరంత.. అప్పులు కొండంత.. నరేంద్ర మోదీ పాలనలో సామాన్యుడికి తిప్పలు