Delhi | మొన్నటి వరకూ తీవ్ర కాలుష్యం.. ఇప్పుడు చలి.. ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి (temperature dips). గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రలు 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి (temperature dips). గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రలు 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యల్పం అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో సఫ్ధర్‌జంగ్ వెదర్ స్టేషన్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఇది సాధారణం కంటే నాలుగు పాయింట్లు తక్కువ అని పేర్కొంది. దాదాపు గడిచిన 14 సంవత్సరాల్లో 5 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఐఎండీ తెలిపింది. 1987 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో అత్యల్పంగా 4.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక ఇన్ని రోజులూ తీవ్ర వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ వాసులు.. ఇప్పుడు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు. నిరాశ్రయులు నైట్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read..
Heavy Rains | చెన్నైలో కుండపోత.. 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు.. అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
Snowfall | జమ్ముకశ్మీర్‌పై మంచు వర్షం.. శ్వేత వర్ణంతో పర్యాటకులను ఆహ్వానిస్తున్న రహదారులు
Pollution | పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో.. టాప్ 3లో భారత్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

