న్యూఢిల్లీ: ఒక ఎన్జీవో కార్యాలయంలో దొంగతనం జరిగింది. (burglary at an NGO office) మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ వంటి పలు గాడ్జెట్లు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. కొన్ని గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మే 13న జనక్‌పురిలోని జనక్ సినిమా కాంప్లెక్స్‌లో ఉన్న ‘ప్రొత్సాహాన్ ఇండియా ఫౌండేషన్’ కార్యాలయంలో దొంగతనం జరిగింది. ఆ రోజు ఉదయం ఆఫీస్‌కు వచ్చిన సిబ్బంది విండో పగిలి ఉండటాన్ని గమనించారు. మూడు మొబైల్ ఫోన్లు, 12 ట్యాబ్స్, లాప్టాప్ ఛార్జర్‌తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు చోరీ అయ్యాయని గ్రహించారు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మహావీర్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న 19 ఏళ్ల రోహన్ అలియాస్ ఖంకాను నిందితుడిగా గుర్తించారు. అతడి ఇంట్లో పోలీసులు తనిఖీ చేశారు. ఒక మొబైల్ ఫోన్, 11 ట్యాబ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితోపాటు స్వాధీనం చేసుకున్న గాడ్జెట్లను శుక్రవారం ప్రదర్శించారు. మిగతా వాటిని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Burglar arrested by the team of PS Janak Puri
👉🏼 Accused person namely Rohan @ Khanka arrested
👉🏼 Had stolen mobiles and tablets from the office of an NGO
👉🏼 One stolen mobile phone and 11 stolen tablets recovered#DPUpdates pic.twitter.com/f7iVvCf1Av— DCP West Delhi (@DCPWestDelhi) May 30, 2025
Also Read: